టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు, రిమాండ్ ను నిరశిస్తూ కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని టీడీపీ, జనసేన నాయకులు శుక్రవారం స్థానిక బస్టాండ్ సెంటర్లో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ…. రాజకీయ కక్ష తోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం జగన్ అక్రమ కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కొవ్వూరు లో టీడీపీ జెండా ఎగురవేసి జగన్ కు తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.