in ,

వైసీపీ బస్సు యాత్ర పై మాజీమంత్రి సెటైర్లు

కొవ్వూరు: వైసీపీ బస్సు యాత్రపై మాజీ మంత్రి జవహర్ సెటైర్లు విసిరారు. వైసిపి చేస్తున్నది సామాజిక యాత్ర కాదు సమాజంపై దండయాత్ర అని విమర్శించారు. రాష్ట్రంలో దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకున్నాకే వైసీపీ యాత్ర చేయాలని అన్నారు. దళితుల అభ్యున్నతికి గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 120 పథకాలు ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు. దళితుల సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయో చెప్పాలనీ డిమాండ్ చేశారు.జగన్ దళిత ద్రోహి అని జవహర్ విమర్శించారు. జగన్ దళిత ద్రోహి కాదని చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. జగన్ కు సామాజిక యాత్ర చేసే అర్హత లేదని ఆయన విమర్శించారు.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం12 మంది ఆంధ్రప్రదేశ్ వాసుల దుర్మరణం.

రేపు పురపాలక సంఘం సమావేశం