in ,

రోడ్డు కం రైలు బ్రిడ్జి పై తారు రోడ్డు నిర్మాణం

కొవ్వూరు: రోడ్ కం రైల్వే బ్రిడ్జి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 26వ తేదీ నుండి అక్టోబర్ 26వ తేదీ వరకు రోడ్ కం రైల్వే బ్రిడ్జి రోడ్డు నిర్మాణ పనులు నిమిత్తం రాకపోకలను నిలిపేశారు. అధికారులు ప్రకటించిన గడువు కేవలం ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. కొవ్వూరు వైపు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా జరగడానికి ఆర్ అండ్ బి డి మధుసూదన్ రావు పర్యవేక్షిస్తున్నారు. నేటి నుండి ప్రారంభమైన తారు రోడ్డు నిర్మాణ పనులు నెలాఖరు నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. 26వ తేదీ నుండి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి పై ప్రయాణం చేయాలనుకునే వారి ఆశలు మరి కొంతకాలం ఆగక తప్పదు

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ అరెస్ట్

ఆదోని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి.