- కొవ్వూరు నియోజకవర్గం పరిధిలోని చాగల్లు మండలం మీనానగరం సచివాలయం పరిధిలో 149 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హోం శాఖ మాత్యులు డా.తానేటి వనిత గారు పాల్గొన్నారు. గ్రామంలోని మహిళలు, అవ్వా తాతలను ఆప్యాయంగా పలకరిస్తూ.. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరించారు. గతంలో ఏ నాయకుడు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ సంక్షేమ పాలన చేస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత కొనియాడారు.