ఆదోని న్యూస్ :- ఆదోని యందు గణేష్ నిమజ్జనం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సొసైటీ మాజీ డైరెక్టర్ కుంకునూరు వీరేష్ గారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ భవన్ కూడలి నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందర భక్తాదులకు చలివేంద్రం ఏర్పాటు చేసి ఆదోని నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వై.సాయి ప్రసాద్ రెడ్డి గారి తనయుడు శ్రీ.వై.మనోజ్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడమైనది. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహంనకు పూలమాలలు వేయడమైనది. మరియు ముఖ్యఅతిథిగా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బి శాంతమేడం గారు,పాల్గొన్నారు. నిర్వాహకులు బిసి ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరినాయుడు గారు గంగాధర్, బి.మల్లేశ్వరప్ప, ప్రశాంత్, వివేక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
in Karnool, Latest News, Main News