ఆదోనిలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయం ఎదుట శుక్రవారం లడ్డూ వేలం పోటాపోటీగా జరిగింది. గణేష్ నిమజ్జనం ప్రారంభానికి ముందు లడ్డూ వేలంపాట నిర్వహించడం అనవాయితీగా వస్తోందని నిర్వాహకులు తెలిపారు. రూ. 1. 10 లక్షలకు వేలంలో లడ్డూను దక్కించుకున్నట్లు భారత్ గ్యాస్ ఏజెన్సీ మల్లికార్జున రెడ్డి తెలిపారు. స్వామి వారి హుండీని రూ. 41, 116కు వేలం పాటలో శ్రీకాంత్ రెడ్డి దక్కించుకున్నారు.