అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేట గ్రామంలో ఇంటింటికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా సిహెచ్ఓ ఎం.బి షకినా ఆధ్వర్యంలో ముమ్మరంగా ఆరోగ్య సర్వేలు చేస్తున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ 18ఏళ్లు దాటిన వారికి బిపి, షుగర్, హెచ్.బి, డెంగ్యూ, మలేరియా వంటి 8రకాల టెస్టులు,10ఏళ్లు దాటిన వారికి హెచ్.బి టెస్టులు చేస్తున్నామన్నారు. అలాగే వచ్చే నెల 12న జరిగే మెడికల్ క్యాంపుకు స్పెషలైజేషన్ డాక్టర్లు వస్తున్నారని, ఎవరికైనా అనారోగ్యంగా ఉన్న వరికి మెడికల్ క్యాంపులో పాల్గొనడానికి టోకెన్లు అందజేస్తున్నారు.ఈకార్యక్రమంలో ఏఎన్ఎం సత్యవేణి,ఆశా కార్యకర్తలు కృపావతి, కుమారి పాల్గొన్నారు