పాడేరు సెప్టెంబర్ 27:- అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్ల పోస్టులకు బుధవారం స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయంలో జరుగుచున్న మౌఖిక పరీక్షలు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయి. పాడేరు ఐటిడిఎ ఫరిధిలోని పది మండలాలలో ఖాళీగా ఉన్న 30 అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్ల పోస్టులకు 106 దరఖాస్తులు రాగా అనివార్య కారణములతో ఏడు దరఖాస్తులు తిరష్కరణకు గురయ్యాయి. కాగా 99 దరఖాస్తులు పరిశీలించి పూర్తి స్థాయిలో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి వి. అభిషేక్ తెలిపారు. ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా, ఎటువంటి సిఫార్సులకు తావు లేకుండా, అత్యంత పారదర్శకంగా ప్రతిభకే ప్రాధాన్యతనిస్తూ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని పిఒ వివరించారు. రాత్రి ఏ సమయానికైనా పోస్టుల భర్తీని పూర్తి చేసి అపాయింట్మెంట్ ఉత్తర్వులు జారీ చేస్తామని పిఒ స్పష్టం చేసారు.
ఈ ఇంటర్వ్యూ నిర్వహణలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. సి. జమాల్ బాషా, ఐసిడిఎస్. సిడిపిఒ ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు.