in , , ,

కొమరాడలో ‘స్పందన’కు 62 వినతులు’

కొమరాడ మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 62 మంది వ్యక్తిగత, సామాజిక సమస్యలపై వినతిపత్రాలు అందించారు. కొమరాడ మండలాన్ని రెండు భాగాలుగా చేస్తూ ప్రవహిస్తున్న నాగావళి నదిపై పూర్ణపాడు – లాబేసు గ్రామాల మధ్య వంతెన నిర్మాణం పూర్తి చేయాలని సీపీఎం నాయకులు కె.సాంబమూర్తి, తదితరులు కోరారు. అదేవిధంగా పార్వతీపురం నుంచి కూనేరు గ్రామం వరకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారిపై ఏర్పడిన గోతులను పూర్తిస్థాయిలో పూడ్చాలని వారు అర్జీ ఇచ్చారు. శిఖవరం గ్రామ జంక్షన్‌ నుంచి వెంపర్లవలసగ్రామం వరకు గ్రావెల్‌ రోడ్డు మంజూరు చేయాలని టీడీపీ మండల కన్వీనర్‌ శేఖరపాత్రుడు ఆధ్వర్యంలో గ్రామస్థులు వినతిపత్రం అందించారు. రెవెన్యూకు సంబంధించి అధికంగా 29 వినతులు వచ్చాయి. ఎంపీడీవో కార్యాలయానికి సంబంధించి 17, డీఆర్‌డీఏకు 2, పంచాయతీరాజ్‌ శాఖకు 5, ఐటీడీఏకు 3, వెలుగుకు ఒకటి, డీఎఫ్‌వోకు ఒకటి, ఐసీడీసీ ఒకటి, రోడ్లు భవనాలశాఖకు మూడు చొప్పున దరఖాస్తులు వచ్చాయి. వాటిని కలెక్టర్‌తో పాటు జేసీ గోవిందరావు, ఆర్డీవో హేమలత, జిల్లా స్థాయి అధికారులు పరిశీలించారు

Written by Prasad

అర్జీలను పక్కాగా పరిశీలించండి”

ఆదర్శ పాఠశాలను.. ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీపీ