జిల్లాలో రాగులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనును జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు తెలిపారు.
పార్వతీపురం, అక్టోబరు7 జిల్లాలో రాగులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ.. ఖరీ (2023-24) సీజన్కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మాదిరిగానే రైతులు పండించిన రాగుల పంటను కూడా కేంద్రాలు క్వింటాకు రూ.3,846 మద్దతు ధరగా ప్రకటించినట్లు తెలిపారు. వ్యవసాయశాఖ అంచనాల మేరకు 936 మెట్రిక్ టన్నుల దిగుమతి వస్తుందని, అందులో 468 మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తాయని ఆయన చెప్పారు. జిల్లాలో సీతంపేట, సాలూరు, పాచిపెంట, పార్వతీపురం, కొమరాడ, కురుపాం, గుమ్మలక్ష్మీపురంలోని 49 ఆర్బీకేల్లో 11 రాగుల కొనుగోలు కేంద్రాలను గుర్తించామన్నారు. ఇదిలా ఉండగా ధాన్యం కొనుగోలుకు ఈ-క్రాప్ తప్పనిసరి అని జేసీ తెలిపారు. జిల్లాలో ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని చెప్పారు. గోనె సంచులను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎండీ నాయక్ తదితరులు ఉన్నారు.