మెట్టవలసలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియ వ్యక్తు లు శుక్రవారం పాక్షికంగా ధ్వంసం చేశారు.
బొబ్బిలి: మెట్టవలసలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తు లు శుక్రవారం పాక్షికంగా ధ్వంసం చేశారు. విగ్రహం చేతిని, కాలిని ధ్వంసం చేసి పక్కకి ఒరిగేలా చేశారు. అలాగే బసెల్టరు దగ్గరగల వైసీపీ ఫ్లెక్సీని చించేశారు. దీనిపై గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ అరసాడ శంకరరావుతో పలువురు వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలియగానే సీఐ నాగేశ్వరరావు తమ గ్రామానికి వెళ్లి పరిశీలించారు. వైస్ ఎంపీపీ సహకారంతో విగ్రహాని సరిచేయించి నిలబెట్టించారు.