టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా జిల్లాలో టీడీపీ శ్రేణుల దీక్షలు కొనసాగుతున్నాయి
వినూత్నంగా ప్రదర్శనలు..
వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు..
ఇంటింటికీ కరపత్రాల పంపిణీ
బాబును విడుదల చేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని శ్రేణుల వెల్లడి
పార్వతీపురం, అక్టోబరు 7: టీడీపీ
అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా జిల్లాలో టీడీపీ శ్రేణుల దీక్షలు కొనసాగుతున్నాయి. కార్యకర్తలు, నేతలు అలుపెరగకుండా పోరాడుతున్నారు. రోజూ వినూత్నంగా నిరసనలు తెలియజేస్తున్నారు. బాబు సురక్షితంగా అలుపెరగకుండా పోరాడుతున్నారు. రోజూ వినూత్నంగా నిరసనలు తెలియజేస్తున్నారు. బాబు సురక్షితంగా జైలు నుంచి విడుదల కావాలని ఆకాంక్షిస్తూ పూజలు, దీక్ష చేపడుతున్నారు. మరోవైపు ఇంటింటికీ వెళ్లి కరపత్రా పంపిణీ చేస్తున్నారు. వైసీపీ సర్కారు కుట్రను ప్రజలకు తెలియజేస్తున్నారు. టీడీపీ శ్రేణుల ఆందోళనలకు అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది. అన్నిచోట్లా అభిమానులు, మహిళలు స్వచ్ఛందంగా వచ్చి దీక్షలో కూర్చొంటున్నారు. కార్యకర్తలతో పాటు నినదిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం మండలం జమిదాల గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో శ్రేణులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గుమ్మలక్ష్మీపురంలో చేపట్టిన నిరసన దీక్షలో మాజీ ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు, కురుపాం నియోజకవర్గ ఇన్చార్జి తోయక జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు. సాలూరు నియోజకవర్గం మక్కువలో A పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో శ్రేణులు రిలే దీక్ష చేపట్టాయి. సీతంపేట మండలం తాడిపాయి గిరిజన గ్రామంలో పాలకొండ. మండలం తాడిపాయి గిరిజన గ్రామంలో పాలకొండ
నియోజకవర్గ మండలం తాడిపాయి గిరిజన గ్రామంలో పాలకొండ
నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మక జయకృష్ణ ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం శ్రేణుల కలిసి రిలే దీక్షలో కూర్చొన్నారు. ఈ సందర్భంగా వై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొమరాడ మండలం తీలేసు గ్రామస్థులు టీడీపీ నాయకులతో కలిసి వరి పైరు మధ్యలో ప్లకార్డులు, పార్టీ జెండాలను పట్టుకుని ‘బాబుతో మేము’ ఉన్నామంటూ నిరసన తెలిపారు. ఇలా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ కార్యకర్తలు, నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిమ్మక జయకృష్ణ ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం శ్రేణుల కలిసి రిలే దీక్షలో కూర్చొన్నారు. ఈ సందర్భంగా వై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొమరాడ మండలం తీలేసు గ్రామస్థులు టీడీపీ నాయకులతో కలిసి వరి పైరు మధ్యలో ప్లకార్డులు, పార్టీ జెండాలను పట్టుకుని ‘బాబుతో మేము’ ఉన్నామంటూ నిరసన తెలిపారు. ఇలా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ కార్యకర్తలు, నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.