:సెప్టెంబర్ 29
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నేడు శుక్రవారం కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి.
నేడు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 54,620 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.98 కోట్లు రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి
దేవస్థానం వెల్లడించింది.
నేడు స్వామివారికి పౌర్ణమి గరుడ సేవను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఉదయం 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీవారు దర్శనమివ్వనున్నారు…