in ,

శరవేగంగా రోడ్ కం రైల్వే బ్రిడ్జి రోడ్డు నిర్మాణ పనులు

రాజమహేంద్రవరం, కొవ్వూరులను కలుపుతూ గోదావరి నది పై నిర్మించిన  రోడ్ కం రైల్వే బ్రిడ్జి పై రోడ్డు మరమత్తు పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ఈ మేరకు ఆదివారం రోడ్డు కం రైల్వే బ్రిడ్జి పై జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు. వాస్తవ పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… ముందుగా నిర్దేశించిన లక్ష్యం ప్రకారం అక్టోబర్ 26 నాటికి రోడ్డు కం రైల్వే బ్రిడ్జి పై రోడ్డు నిర్మాణ పనులు పూర్తి అవుతాయని ప్రకటించారు. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. రోడ్డు అభివృద్ధి పనుల కోసం రెండు కోట్ల 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేస్తున్నామన్నారు. ఈ మార్గం ద్వారా అత్యవసర అవసరాల కోసం బైక్  వెళ్తున్న వారిని కూడా పూర్తిగా నిషేధించాలని అధికారులకు సూచించారు. అలాగే రైల్వే బ్రిడ్జి పనుల కోసం మరో 32 కోట్ల అంచనా వ్యయం అవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

జమ్మంకాలమ్మ దేవి కళ్యాణ మహోత్సవ వేడుకలు.

చంద్రబాబు ఆరోగ్య పరిస్తితి బాగానే ఉంది