in , ,

రూ. 3.01 లక్షలు పలికిన వినాయక విగ్రహం

  • వేలం పాటలో వినాయకుడి మట్టి విగ్రహనికి మూడు లక్షల ఒక వేయి రూపాయల ధర పలికింది.తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలో జరిగింది. వినాయక చవితి పర్వదినాన్ని పురష్కరించుకుని మండలంలోని చివటం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మట్టి విగ్రహానికి వేలంపాట నిర్వహించారు.ఈ వేలంపాటలో రూ.3.01 లక్షలకు గ్రామానికి చెందిన సింహద్రి వెంకటలక్ష్మి విగ్రహన్ని దక్కించుకున్నట్లు చివటం వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. 21 మంది డిపాజిట్‌ కట్టి ఈ వేలంలో పాల్గొనగా ముగ్గురి మధ్య పోటాపోటీగా పాట జరిగింది. వినాయక చవితి ఉత్సవాల్లో సహజంగా లడ్డూ ప్రసాదానికి వేలం పెడతారు. కాని చివటంలో మాత్రం విగ్రహానికి వేలం నిర్వహిస్తారు.అలా వేలంలో విగ్రహాన్ని దక్కించుకున్న వారు ఐదు రోజులు గ్రామంలో మేళతాళాలు, విచిత్ర వేషధారణలతో ఊరేగించి తమ వ్యవసాయ భూముల్లో గాని, భూమి లేని వారు తమ ఇళ్లల్లోని బావుల్లో నిమజ్జనం చేసుకుంటారు. అలా చేయడం వలన వారి పాడి పంటలు సంవృద్ధిగా పండి, కోరికలు తీరుతాయని గ్రామస్తులకు నమ్మకం. 70 సంవత్సరాలుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతోందని కమిటీ సభ్యులు తెలిపారు.

విద్యుత్ చార్జీల భారం పై 27న నిరశన

రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు