జగిత్యాల జిల్లా లో వున్న యూరియా కొరత గురించి జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కి వినతి పత్రం అందజేసిన లక్ష్మీపుర్ సొసైటీ చైర్మన్ పన్నాల తిరుపతి రెడ్డి. జగిత్యాల జిల్లా లో ఈ వర్షాకాలంలో వరి ,మొక్కజొన్న అత్యధికంగా సాగు అవుతుంది అని , వరి, మొక్కజొన్న పంటలకు యూరియా వేసే సమయం దాటిపోతుంది,P.A.C.S మరియు MAX సొసైటీలలో యూరియా నిల్వ లేకుండా పోతుంది అని , వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు అని , బయట మార్కెట్లో వ్యాపారస్తులు సిండికేట్ అయి బస్తాకు అధిక ధర తీసుకుంటున్నారు అని, ఇప్పటికే కూలీల ఖర్చులు, ట్రాక్టర్ దున్నే ఖర్చులు, పెరిగి ఆ భారం మొత్తం రైతులపై పడుతుంటే, ఈ పెరిగిన ధరల కారణంగా బయట మార్కెట్లో రైతులకు యూరియా కొనలేని పరిస్థితిలో ఉన్నారు అని, జగిత్యాల వ్యవసాయ ఆధారిత జిల్లా , తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగు చేస్తున్న జిల్లా మరియు మొక్క జొన్న కూడా సాగు చేస్తుంది,కానీ సమయానికి పంటలకు యూరియా వేయలేకపోతున్నారు అని, ఎందుకంటే యూరియా కొరత కారణంగా, సమయానికి యూరియా పంటకు వెయ్యకపోతే పంట దిగుబడి ఎక్కడ తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు అని, సొసైటీలలో యూరియా అందుబాటులో లేక బయట మార్కెట్లలో అధిక ధరలు చెల్లించలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు అని, సమయనికి యూరియా రైతులకు అందేలా చూడాలని, దీనికోసం సొసైటీలలో అధిక నిల్వలు వుంచి సకాలంలో యూరియా అందుబాటులో వుంచాలని వినతి పత్రంలో తెలియపరిచారు…వీరితో పాటుగా కొట్టాల మోహన్ రెడ్డి ,వంశీ, రాజు పాల్గొన్నారు.
[zombify_post]


