విశాఖ జిల్లా పశు సంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా పనిచేస్తున్న డాక్టర్ మాదిన ప్రసాదరావు జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ప్రభుత్వ పథకాలు, పశు పోషణలో నూతన ఆవిష్కరణలపై ఆయన పాడి రైతులకు అవగాహన కల్పించడంలో చేసిన విశేష కృషికి గాను ‘ఉత్తమ విస్తరణ అధికారిగా’ జాతీయ స్థాయి అవార్డు వరించింది. ఈ నెల 27న హైదరాబాద్లో భారత ప్రభుత్వ సంస్థ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరగనున్న జాతీయ సదస్సులో ఈ అవార్డును అందుకోనున్నారు.