తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేశారు.ఉదయం నుండి పోలీసుల హైడ్రమ మధ్య అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెం అయన స్వగృహంలో గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు.బండారు సత్యనారాయణ అరెస్టును టిడిపి నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెద్దఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు బండారు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కాగా సియం జగన్మోహన్ రెడ్డి, మంత్రి రోజాను దిశ్నించారని గుంటూరు పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.