తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమారెస్టు కేసు నుండి బయటకు రావాలని ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన రాజప్ప సామర్లకోట కాకినాడ రోడ్ లో ఉన్న ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద శనివారం ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ పూజలో పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.