in ,

జడ్పిటిసి అమర్లపూడి కిర్తి సౌజన్య మీడియా ఆత్మీయ సమావేశం

జడ్పిటిసి అమర్లపూడి కిర్తి సౌజన్య మీడియా ఆత్మీయ సమావేశం

నందిగామ నియోజకవర్గ వీరులపాడు సెప్టెంబర్ 28 గురు న్యూస్ 

వీరులపాడు జడ్పిటిసి అమర్లపూడి కిర్తి సౌజన్య కంచికచర్ల తన స్వగృహంలో జడ్పిటిసి కి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జెడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య మాట్లాడుతూ 

ఈ రెండు సంవత్సరాలలో ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆదేశానుసారం మన నియోజకవర్గ పురోభివృద్ధి కి అహర్నిశలు పాటుపడుతున్న ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు సోదరుల నేతృత్వంలో వారి అభీష్టానికి అనుగుణంగ పని చేయటం నా పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నానని తెలిపారు.

నేను ఏపీసీ సహకారంతో కంచికచర్ల, వీరులపాడు మండలాలలోని పలుగ్రామాలలో స్త్రీలకు కుట్టుమిషన్ కార్యక్రమాలు చేపట్టాననిచెప్పారు.

గ్రాంట్స్ 20 లక్షలు జయంతి,దొడ్డదేవరపాడు,అల్లూరు,నరసింహారావు పాలెం గ్రామాలకు ఇవ్వడమైనదని అలాగే

అల్లూరు జడ్ పి హైస్కూల్ హైటెన్షన్ లైన్ మారగపించటం జరిగిందని మరియ పొన్నవరం గ్రామంలో ఇష్క్ ఎంపిపి స్కూల్ గ్రాంట్ 20 లక్షలు రావాల్సి ఉండగా స్సా కు ప్రపోజల్ పంపించడమైనది.స్టేట్ ఆఫీస్ దృష్టి కి తేవడమైనది.ఇంకా అనేక గ్రామాలలో స్త్రీల కు శిక్షణ ఇచ్చి వారి స్వశక్తిపై వారు నిలబడేటట్లు చేయడం జరిగింది

జడ్పీటీసీ కాకముందే మనం స్థాపించిన “యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ” అనే సంస్థను ఇంజనీర్స్ బ్యుటీషియన్,టైలరింగ్,మొదలగు అంశాలపై వందలాది యువతకు శిక్షణ ఇవ్వడం జరిగింది.

వారుతమ స్వంత కాళ్లపై నిలబడి అనేకులకు ఆదర్శంగా నిలవడం జరిగిందని తెలిపారు.

అంతేకాకుండా “అమరావతి అకాడెమీ”స్థాపించి నిరుద్యోగ యువకులకు గ్రూప్1 గ్రూప్11 లలో శిక్షణ నివ్వడం,అలాగే కానిస్టేబుల్, ఎస్ఐ, ఉద్యోగాలకు ఉచిత శిక్షణ నివ్వడం జరిగింది.

నాడు-నేడు రెండవ ఫేజ్ లో వందలాది అనాధ పిల్లలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ నివ్వడం జరుగుతుందని అన్నారు.

నా ఆహ్వానాన్ని మన్నించి ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. నా గెలుపులో ప్రధాన భూమిక వహించి ఈ రెండు సంవత్సరాల యాత్రలో నాకు తోడుగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Khuddus

From Nadigama Assembly

పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ

ఘనంగా భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలు.