in ,

ఘనంగా భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలు.

 భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది.*  *PDSO*

ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి అశోక్ అధ్యక్షత వహించగా… రాష్ట్ర నాయకులు తిరుమలేష్ మాట్లాడుతూ….”భగత్ సింగ్ జీవితంలో జరిగిన స్ఫూర్తి వంతమైన విషయాలను పరిచయం చేసి ఆయన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు వివరిస్తూ,భగత్ సింగ్ స్ఫూర్తితో ఆయన విడిచిన ఆశయాలను నేటి విద్యార్ధి,యువత స్వీకరించి, అసమానతలు,పేదరికం,నిరుద్యోగం లేని ఒక మంచి సమాజం కోసం యువత ఆలోచించాలనీ,అలాగే నేడు సమాజంలో జరుగుతున్న దోపిడీ పైన అన్యాయాల పైన, సామాజిక సమస్యల పైన విద్యార్థి,యువత ప్రశ్నించాలని తెలియజేశారు”. అలాగే రాను రాను ఉపాధి అవకాశాలు కనుమరుగైపోతున్నాయి.ఎన్ని ప్రభుత్వాలు మారిన వారి దోపిడీ విధానాలు మారడం లేదు. నిరుద్యోగాన్ని కావాలనే ఈ ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయి.5 వేలకి, 10 వేలకు యువత శ్రమ శక్తిని కార్పొరేట్లు, MNC కంపెనీలు దోచుకుంటున్నాయి. అదే సమయంలో విద్యార్థి యువత ఆలోచనలను తమ సమస్యల నుండి ప్రభుత్వాలు పక్కదారి పట్టిస్తున్నాయి. కాబట్టి నేటి యువత నిలకడైన, భద్రతతో కూడిన ఉపాధిని సాధించుకునేందుకు పోరాడాలని అని అన్నారు అలాగే  *”బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేసిన విధానాలే నేటికీ మన దేశంలో కొనసాగుతున్నాయి. సామ్రాజ్యవాద,బహుళ జాతి సంస్థల పాదక్రాంతుల క్రిందనే ఈనాటికీ మన దేశం నలిగిపోతుంది. ఉచితంగా విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత నుండి అన్ని ప్రభుత్వాలు క్రమంగా తప్పుకుంటున్నాయి.కాబట్టి భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు,యువకులు అందరికీ ‘విద్యా ,వైద్యం,ఉపాధి’ హక్కు కోసం పోరాడాలని”* పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లోకేష్, ప్రకాష్ ,ప్రవీణ్, రాజేష్ మరియు  విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Written by G.Raju

జడ్పిటిసి అమర్లపూడి కిర్తి సౌజన్య మీడియా ఆత్మీయ సమావేశం

పత్తికొండలో ఘనంగా మిలాద్ ఉన్ నబి వేడుకలు.