in ,

ఆస్పత్రి వద్ద బెంచీలు ఏర్పాటు

  • కొవ్వూరు: ప్రభుత్వ పశు వైద్యశాలలో రైతులకు సరైన వసతులు లేని పరిస్థితి నెలకొంది. పశువులను వైద్యానికి తీసుకువచ్చిన రైతులకు కూర్చోవడానికి కొవ్వూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ కోశాధికారి ఉప్పులూరి రామకృష్ణ ఆర్థిక సహకారంతో ఈ బెంచీలను ఏర్పాటు చేసినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు కలగర వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి పెనుమాక జయరాజు, కోశాధికారి ఉప్పులూరి రామకృష్ణ లయన్స్ క్లబ్ సభ్యులు బూరుగుపల్లి వెంకటేశ్వరరావు,గోలి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

రేపు కొవ్వూరు రానున్న ఎంపీ మిథున్ రెడ్డి

కిషోర బాలికల ఆరోగ్యమే ద్యేయం మంత్రి విడదల రజిని