in ,

ఉపాధి సమస్యలపై ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా.

*ఉపాధి సమస్యలపై ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా*

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న మాట్లాడుతూ,

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో 200 రోజులు పని దినాలు కల్పించాలని,

600 రూపాయలు వేతనం ఇవ్వాలని,

 అడిగిన ప్రతి ఒక్కరికి పని చూపించాలని, ఉపాధి కూలీలను ఆధార్ తో అనుసంధానం చేయరాదని, వారం, వారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ *అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం* పిలుపులో భాగంగా ఈ దినం  *ఆదోని ఎంపీడీవో* కార్యాలయం ముందు మండల కార్యదర్శి రామాంజనేయులు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం కార్యాలయం AO గారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో

కెవిపిఎస్ మండల కార్యదర్శి బి తిక్కప్ప,

వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు శ్రీనివాసులు, ఈరన్న, రహీం, దావీదు, చిన్నముక్కన్న, తిమ్మప్ప, ఖాదర్ బాషా, కాజా తదితర ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Written by G.Raju

గణేకల్లు సబ్ స్టేషన్ ముందు విద్యుత్ కోతలకు నిరసనగా రైతుల ధర్నా.

ఘనంగా గుర్నాథ్ రావ్ జయంతి వేడుకలు పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు