in ,

గణేకల్లు సబ్ స్టేషన్ ముందు విద్యుత్ కోతలకు నిరసనగా రైతుల ధర్నా.

*వ్యవసాయనికి 9 గంటలు కరెంటు ఇవ్వాలని ,గణేకల్లు సబ్ స్టేషన్  ముందు విద్యుత్ కోతలకు నిరసనగా  రైతుల ధర్నా*

రైతులకు వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా మొన్నటి నుండి అనగా 9వ తేదీ నుండి కేవలం 5 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేయడం జరిగిందని, దీనికి నిరసనగా గణేకల్లు, జాలిమంచి పాండవగల్, గ్రామాల రైతులు, *రైతు సంఘం* ఆధ్వర్యంలో గణేకల్లు, స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి బి.వీరారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే,*ములిగే నక్కపై తాటికాయ పడ్డట్టు*

వ్యవసాయానికి విద్యుత్ కోతలు విధించడం ఎంతవరకు సమంజసం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

,వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు చేతికొచ్చే దశలో రైతులకు అన్యాయం చేస్తున్నారని, పెట్టిన పెట్టుబడులు రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరాని కొనసాగించాలని లేనిపక్షంలో విద్యుత్ అధికారులు కార్యాలయాలను దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు హనుమంత్ రెడ్డి, డివైఎఫ్ఐ మండల నాయకులు చిరంజీవి, వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Written by G.Raju

ముమ్మరంగా ఏయిమ్ సభ్యత్వ నమోదు

ఉపాధి సమస్యలపై ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా.