in ,

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభుత్వ లక్ష్యం కే కే రాజు

గురు న్యూస్ విశాఖపట్నం :ఆరోగ్య ఆంద్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ శ్రీ కె.కె రాజు గారు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న జగనన్న అరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విశాఖ ఉత్తర నియోజకవర్గం 48వార్డు NH-16 బర్మా క్యాంపు వై.యస్.ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC) వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపు నిర్వహించమని అన్నారు .ఈ సందర్భంగా శ్రీ కె.కె రాజు గారు మాట్లడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ప్రతి సంక్షేమ పథకం ప్రజల ముంగిటికే అందే విధంగా చేయాలనే ఉద్దేశంతో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి సత్ఫలితాలు సాధించడానికి ఈ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వార ఒక్క పైసా ఖర్చు లేకుండా వైద్య పరీక్షలు మందులు ఉచిత కళ్ళ జోల్లు ఇచ్చి వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు.ఈ అవకాశం ప్రతీ ఒక్కరు ఉపయోగించు కోవాలని అన్నారు.

Written by Balakishan

యాస్పిరేష‌న్ బ్లాక్‌ఫెలో ఉద్యోగాల‌కు 7న ఇంట‌ర్వ్యూలు

చంద్రబాబు బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా