in ,

యాస్పిరేష‌న్ బ్లాక్‌ఫెలో ఉద్యోగాల‌కు 7న ఇంట‌ర్వ్యూలు

 పాడేరు అక్టోబ‌రు 4 : నీతి ఆయోగ్ యాస్పిరేష‌న్ బ్లాక్ ఫెలో  ఉద్యోగాల రాత ప‌రీక్ష ఫ‌లితాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ సుమిత్ కుమార్  బుధ‌వారం  వెల్ల‌డించారు. సెప్టెంబ‌రు 30 తేదీన రాత ప‌రీక్ష నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌న్నారు.  ఈ నెల 7 వ తేదీన  రంప‌చోడ‌వ‌రం ఐటిడి ఏ కార్యాల‌యంలో లో  మౌఖిక ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని    ఒక ప్ర‌క‌ట‌న‌లో  తెలియ జేసారు. ఇంట‌ర్వ్యూకు ఎంపికైన  అభ్య‌ర్దుల జాబితాను జిల్లా క‌లెక్ట‌ర్ అధికారిక వెబ్‌సైట్‌లోను  పొందుప‌ర్చామ‌ని అన్నారు. సిపి ఓ కార్యాల‌యం నోటీస్ బోర్డులో  జాబితాను ప్ర‌ద‌ర్శించ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. అర్హ‌త సాధించిన అభ్య‌ర్దుల‌కు వ్య‌క్తిగ‌తంగా స‌మాచారం అందిస్తామ‌న్నారు.

చంద్రబాబు కోసం సంతకాల సేకరణ చేసిన ఎమ్మెల్యే గణబాబు

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభుత్వ లక్ష్యం కే కే రాజు