తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గం ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి పై పోలీసులు పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బుధవారం మాచర్ల పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. భారత రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు అయ్యేలా చూడాలని కోరుతూ పూజ్య బాపూజీకి వినతి పత్రం అందించేందుకు టిడిపి శ్రేణులు వెళ్తున్న విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు దీంతో టిడిపి శ్రేణులకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది నిరసనకారుల దగ్గర నుండి పట్టణ పోలీసులు వినతిపత్రం తీసుకొని అక్కడ నుంచి పంపించి వేశారు.