in , ,

రోడ్డు ప్రమాదంలో నలుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల దుర్మరణం

బెంగళూరు:సెప్టెంబర్ 27:బస్సును కారు ఢీకొనడంతో నలుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల దుర్మరణం పాలైన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో బుధవారం ఉదయం  చోటుచేసుకుంది.

బెంగళూరు,మైసూరు హైవేపై నాగమంగళ సమీపంలో అక్కడి బస్టాండ్‌ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. మృతులంతా బెంగళూరుకు చెందినవారిగా తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…

Written by Allagadda CM news

ల్యాండర్‌, రోవర్‌పై సన్నగిల్లుతున్న ఆశలు

25వ పుట్టిన రోజు జరుపుకుంటున్న గూగుల్