ట్రాక్టరు బోల్తా పడడంతో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయిట్రాక్టరు బోల్తా పడడంతో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతారామ రాజు జిల్లా అనంతగిరి మండలం గొట్లపాడు గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు పాడి కన్నమ్మ, మూట నాగమణి, జన్ని కన్నమ్మ, జన్ని లచ్చయ్య, మజ్జి కొండమ్మ, జన్ని ఎరుకమ్మ, శోభ గంగమ్మలు గుమ్మకోట నుంచి బుధవారం రాత్రి టాక్టర్ స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలో ఉన్న మలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. వీరంతా గాయపడ్డారు. ఇందులో పాడికన్నమ్మ తీవ్రంగా గాయాలు కావడంతో ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారు.