in , ,

పిడుగుపాటు కు యువకుడు మృతి

అనకాపల్లి జిల్లా: పిడుగుపాటుకు యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం….జోగంపేట గ్రామానికి చెందిన సూదిపరపు జయంత్ అనే యువకుడు పాత మల్లంపేట లోని సచివాలయానికి బయలు దేరాడు. ఇంతలో భారీ వర్షం పడటంతో సమీపంలో ని చింతచెట్టు కిందకు వెళ్ళాడు. అయితే ఆకస్మాత్తుగా పిడుగు పడటంతో గాయపడ్డాడు. దీంతో స్థానికులు హుటాహుటిన నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.

[zombify_post]

మనోదైర్యం కల్పించేలా ప్రభుత్వ సంక్షేమ పథకాలు -గంగుల కమలాకర్

జగిత్యాల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ శ్రీ ఎగ్గడి భాస్కర్ గారు