గురు న్యూస్ విశాఖపట్నం : బ్రతుకు బండి లాగేందుకు ఇబ్బందిపడుతూ ఆటో, టాక్సీలను నడుపుకుంటున్న అన్నదమ్ములను, అక్కచెల్లెమ్మలను ఆదుకునేందుకు మన ప్రభుత్వంలో వైయస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టాం.అని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అయన మాట్లాడుతూ స్వంతంగా ఆటో , టాక్సీలను నడుపుకుంటున్న వారు వివిధ సర్టిఫికెట్లు పొందడంలో అండగా నిలిచే ఉద్దేశంతో ఈ పథకం ద్వారా వారికి ఏటా రూ.10 వేలు అందజేస్తున్నాం. అని ఆయన అన్నారు. దేవుడి దయతో నేడు వరుసగా ఐదో ఏడాది 2,75,931 మంది డ్రైవర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.276 కోట్లను జమచేశాం. ఈ పథకం ద్వారా ఇప్పటివరకూ ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.1,300 కోట్లను మన ప్రభుత్వం అందజేసింది అని సీఎం జగన్ అన్నారు.