మాచర్ల మండల పరిధిలోని కంభంపాడు గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది గ్రామానికి చెందిన కారుమంచి నరసింహారావు భార్య అరుణ అదే వీధిలో ఉంటున్న కంచర్ల గురవయ్యను దుర్భాషలాడుతూ ఉండటంతో ఆగ్రహించిన గురవయ్య గొడ్డలితో నరసింహారావు పై దాడికి దిగాడు ఈ దాడిలో నరసింహారావు గాయపడ్డాడు మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.