కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు గ్రామం లో శుక్రవారం నామట్టి నా దేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. నా మొదటి నాదేశం వందనం…. నేల తల్లికి నమస్కారం అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. వీరికి గ్రామస్తులు సంఘీభావం తెలిపారు. అనంతరం గ్రామంలో మట్టిని సేకరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.