in

పార్ల‌మెంటు ప్ర‌స్థానంపై మోడీ కీల‌క వ్యాఖ్య‌లు

[ad_1]

పార్ల‌మెంటు ప్ర‌త్యేక‌ స‌మావేశాల తొలిరోజు లోక్‌స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై కీల‌క చ‌ర్చ‌ను ఆయ‌న ప్రారంభించారు. రేపటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు కొత్త భవనంలో జరగనున్న వేళ.. పాత భవనంతో జ్ఞాపకాలను ప్ర‌ధాని మోడీ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ వంటి పలు రాష్ట్రాల ఏర్పాటుకు ఈ భవనం వేదికైందని తెలిపారు. తొలుత జీ 20 సమావేశాల గురించి మాట్లాడుతూ… జీ20 సదస్సు విజయం ఏ ఒక్క పార్టీదో.. వ్యక్తిదో కాదని.. యావత్‌ 140 కోట్ల భారతీయులదని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

చంద్ర‌యాన్‌-3 ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మాట్లాడుతూ.. చంద్ర‌యాన్ -3 విజ‌యం కోసం ప్ర‌తి భార‌తీయుడూ త‌ప‌న ప‌డ్డార‌ని తెలిపారు. ఈ ప్ర‌యోగాన్ని విజ‌య‌వంతం చేసిన‌ భారత శాస్త్ర సాంకేతిక నిపుణులకు పార్ల‌మెంటు భవనం నుంచి శతకోటి వందనాలు సమర్పిస్తున్నాన‌ని వ్యాఖ్యానించారు. భారత దేశ‌ అభివృద్ధి వీచికలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయ‌న్నారు. 75 ఏళ్లలో మనం సాధించింది ప్రపంచాన్ని అబ్బురపరిచింద‌ని తెలిపారు.

ప్ర‌స్తుతం స‌భ‌లు జ‌రుగుతున్న పార్ల‌మెంటు భ‌వ‌నం గురించి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ భావోద్వేగ వ్యాఖ్య‌లు చేశారు. “ఈ చారిత్రక భవనం నుంచి మనం వీడ్కోలు తీసుకుంటున్నాం. స్వాతంత్య్రానికి ముందు ఈ భవనం ఇంపీరియల్‌ లెజిస్లేచర్‌ కౌన్సిల్‌గా ఉండేది. ఈ భవనం చారిత్రక ఘట్టాలకు వేదికైంది. మనం కొత్త భవనంలోకి వెళ్లినా.. పాత భవనం మనకు నిరంతర ప్రేరణగా నిలుస్తుంది. భారత్‌ సువర్ణాధ్యాయానికి ఈ భవనం సాక్షి. ఇక్కడ జరిగిన చర్చలు, ప్రణాళికలు భారత గతిని మార్చాయి’’ అని ప్ర‌ధాని మోడీ కొనియాడారు.

తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ, వాజ‌పేయి, మ‌న్మోహ‌న్ సింగ్ స‌హా ఎంతో మంది ప్ర‌ధానులు ఈ భ‌వ‌నం నుంచే దేశ‌పురోభివృద్ధికి సంబంధించిన కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని ప్ర‌ధాని వెల్ల‌డించారు.

[ad_2]

Report

What do you think?

Written by Naga

రజాకార్‌ సినిమాపై సెన్సార్‌ బోర్డుకు ఫిర్యాదు చేస్తాం : కేటిఆర్‌

Razakar Teaser: వివాదంగా మారుతున్న ర‌జాకార్ చిత్రం..టీజ‌ర్‌పై ఘాటుగా స్పందించిన మంత్రి కేటీఆర్ | Vidhaatha