యాంకర్:- జగిత్యాల జిల్లా కోరుట్లలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైంది.కోరుట్ల డిపోకు చెందిన ఆర్టీసీ రాజధాని బస్సు శంషాబాద్ నుంచి కోరుట్లకు చేరుకుంది. సుమారు 25 మంది ప్రయాణికులను బస్టాండ్ లో దింపింది. అనంతరం బస్సు డ్రైవర్ బస్సును డిపోలో డీజిల్ బంక్ వద్ద నిలిపి వెళ్లిపోయాడు.డ్రైవర్ వెళ్లిపోయిన ఐదు నిమిషాలకే షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి.ఆ మంటలకు ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైంది.దాంతో పాటుగా డీజిల్ బంకులోకి మంటలు వ్యాపించాయి.