in ,

సేవా రంగంలో విద్యార్థులు ముందుండాలి – కళాశాల ప్రిన్సిపల్ క్యాతం

  • రాజన్న సిరిసిల్ల జిల్లా :సేవారంగంలో విద్యార్థులు ముందుండాలని అంకితభావంతో రాణించాలని కళాశాల ప్రిన్సిపాల్ క్యాతం సత్యనారాయణ అన్నారు. ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం దినోత్సవం సందర్భంగా  మంగళవారం ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమాలలో సేవలను అందించిన విద్యార్థులకు మెమొంటోలు బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1969 సెప్టెంబర్ 24న అప్పటి కేంద్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ వి కె ఆర్ వి రావు ప్రారంభించారని విద్యార్థులను సామాజిక సేవకులుగా మలచడం నాయకత్వ లక్షణాలని అన్నారు. అదేవిధంగా శ్రమ జీవనం అలవాటు చేయడం ద్వారా నైపుణ్యాలను వెలికితీయడం జాతీయ సేవా పథకం అని కొనియాడారు. ఎన్ ఎస్ ఎస్ పర్యవేక్షకులు వాసర వేణి పరుశరాములు తనదైన శైలిలో విద్యార్థులకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చెరుకు భూమక్క,మాదాసు, చంద్రమౌళి,నీరటి విష్ణు, ప్రసాద్, సాగర్,గీత, చిలుక ప్రవళిక,గౌతమి, బోధనేతర సిబ్బంది విమల్ కుమార్, దేవేందర్,తాజోద్దీన్, లక్ష్మి,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
  • – 

Written by Mahesh

ప్రాణాలను పణంగా పెట్టి మహిళ ను కాపాడిన కానిస్టేబుల్

*దివ్యాంగుల బస్ పాస్ స్పెషల్ క్యాంప్ మేళా*