in , ,

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం*

గజపతినగరం మండలం, రాజాం పట్టణాల్లో శనివారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో గుర్తు తెలియని వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు.గజపతినగరం, రాజాం,  గజపతినగరం మండలం, రాజాం పట్టణాల్లో శనివారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో గుర్తు తెలియని వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు.

గజపతినగరం మండలంలోని మరుపల్లి వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో కె. రాము (58) దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెరకముడిదాం మండలం మర్రివలసకు చెందిన ఈయన మరుపల్లిలోని కుమార్తెను చూసేందుకు శనివారం వచ్చారు. రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో కిందపడిపోయారు. గజపతినగరం ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ సత్యనారాయణ తెలిపారు.

రాజాం పట్టణంలోని బొబ్బిలి రహదారిలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో పెనుబాకకు చెందిన బండి శ్రీను (35) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు సమాచారం ఇవ్వగా 108 వాహనంతో వచ్చిన సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సీఐ కె. రవికుమార్, ఎస్సై రవికిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

బీఆర్ ఎస్ పార్టీ లోకి చేరికలు

ఏ ముఖం పెట్టుకుని వచ్చావంటే ఏం చెప్పను#