పాడేరు సెప్టెంబరు 26 : ఈనెల 27 వ తేదీ బుధవారం పెదబయలులో జగనన్నకు చెబుదాం ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. పెదబయలు ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించే స్పందనకు జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలని ఆదేశించారు. స్పందన కార్య క్రమం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగు తుందన్నారు. అనంతరం శాఖాధికారులు సంబంధిత క్షేత్ర స్థాయి సిబ్బందితో సచివాలయాల్లో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. ఈ అవకాసాని పెదబయలు ప్రజలు వినుయోగించుకోవాలి అని కలెక్టర్ కోరారు.