in ,

రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు

కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 2 పోలింగ్‌స్టేషన్‌లను కొత్తగా ఏర్పాటుచేసినట్లు కొవ్వూరు ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు తెలిపారు. నియోజకవర్గంలో 1,78,133మంది ఓటర్లు ఉన్నారని, మహిళలు 91272, పురుషులు 86855, ట్రాన్స్‌జెండర్స్‌ 6గురు ఓటర్లుగా నమోదయ్యారన్నారు. వివిధ రాజకీయ ప్రతినిధుల సూచనల మేరకు కొవ్వూరు పట్టణంలో పండిత మధన మోహన మాలవ్య మున్సిపల్‌ హైస్కూల్‌ల్లో ఉన్న 74,75 పోలింగ్‌స్టేషన్లలో ఒక్కొక్క పీఎస్‌లో 1460 ఓటర్లు ఇప్పటికే నమోదై ఉండడంతో ముందుస్తు జాగ్రత్త చర్యగా కొత్తగా 76వ పీఎస్‌ను ఏర్పాటు చేశామన్నారు. చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామంలో 154,155 పీఎస్‌లు ఉండగా కొత్తగా 156 పీఎస్‌ను ఏర్పాటు చేశామన్నారు. వీటితో నియోజకవర్గంలో మొత్తం పీఎస్‌ల సంఖ్య 176కు పెరిగాయన్నారు. అదేవిధంగా నాడు – నేడు పనులు, మరమ్మతులు జరుగుతున్న పాఠశాలల్లో ఉన్న 5 పీఎస్‌లను సమీపంలో ఉన్న ఆర్‌బీకే, సచివాలయ భవనాల్లోకి మార్పు చేశామన్నారు. తాళ్లపూడి మండలం మలకపల్లిలో 2, తాడిపూడిలో -2, చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో -1 పీఎస్‌ను కొత్తభవనాల్లోకి మార్పు చేశామన్నారు. 15 పీఎస్‌ల పేర్లు మార్పు చేశామన్నారు. 2023 అక్టోబర్‌ 17వ తేదీ నుంచి ఓటర్ల సమరీ రివిజన్‌ జరుగుతుందన్నారు. బీఎల్‌వోలు ఇంటింటికీ ఓటర్ల తనిఖీకి వెళ్లిన సమయంలో అందుబాటులో లేనివారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి గతంలో ఉన్న అడ్రస్‌కు రిజిష్టర్‌ పోస్టు ద్వారా నోటీసు పంపిస్తామన్నారు. నోటీసు అందిన 15 రోజులలో దానికి సమాధానం ఇవ్వాలని లేనిచో ఆ ఓటును తొలగిస్తామన్నారు. ఇప్పటివరకు నియోజవర్గంలో ఫారం 6లు 3720, ఫారం 7లు 2965, ఫారం 8లు 14975 దరఖాస్తులు వచ్చాయన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ తమ ఓటు నమోదు చేసుకోవాలని ఆర్డీవో మల్లిబాబు కోరారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

రూ. 3.01 లక్షలు పలికిన వినాయక విగ్రహం

గణేష్ ఉత్సవాల్లో అనసూయ సందడి