in ,

రెండవ రోజు పూజలు అందుకుంటున్న గణనాథుడు

చర్ల మండలంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ముడలంలోని వాడవాడలా వినాయక చవితి నాడు మండపాలలో బొజ్జ గణపయ్య కొలువుదీరి పూజలందుకున్నాడు. చర్ల మండల కేంద్రంలోని ఆయిల్ బంక్ ఏరియా లో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి నాడు విఘ్ననాయకుడికి విగ్రహదాతలు ఉప్పులూరి రాంబాబు రాణి దంపతులు తొలిరోజు పూజలు జరిపారు.అర్చకులు విజయ్ శర్మ భక్తులకు వినాయక వ్రతకల్పాన్ని వినిపించి చవితి రోజున వినాయకుడిని పూజించడం వల్ల కలిగే శుభాలను వివరించారు.బస్టాండ్ ఏరియాలో విగ్రహ దాత సీనియర్ జర్నలిస్టు జవ్వాది మురళి కృష్ణ దంపతులచే పూజా కార్యక్రమాల అనంతరం ఆర్ కొత్తగూడెం భజన బృందం భక్తి గీతాలు ఆలపించారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు 

[zombify_post]

Report

What do you think?

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

పెండింగ్ తునికాకు బోనస్ తక్షణమే చెల్లించాలి

మావోయిస్టు పార్టీ 19వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం