రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి బొబ్బిలి, డొంకన వలస రైల్వేస్టేషన్ల మధ్య డౌన్లైన్ రైల్వే ట్రాక్ పై శుక్రవారం సాయంత్రం సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ట్రైన్ నుంచి జారిపడటం వలన లేదా పట్టాలు దాటే క్రమంలో ట్రైన్ ఢీకొని వ్యక్తి మృతి చెంది ఉంటాడని పోలీసులు అన్నారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. దర్యాప్తు నిమిత్తం మృతదేహాన్ని బాడంగి గవర్నమెంట్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
[zombify_post]

