గురు న్యూస్ విశాఖపట్నం: చంద్రబాబు గారి ఆరెస్ట్ కి నిరసనగా, అనంతపురం గ్రామీణ మండలం పాపంపేటలో మాజీ మంత్రి పరిటాల సునీత చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షని భగ్నం చేసిన పోలీసులు. ఉదయాన్నే దీక్షాశిబిరాన్ని చుట్టుముట్టి సునీతగారిని, ఆమెతో ఉన్న మహిళా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తాము శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్ట్ చెయ్యడం సరి కాదన్నారు. తమేమి ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగించాలేదని తమ దీక్ష వలన అయినా తమను అడ్డుకుంటున్నారు అని ఆమె ఆరోపించారు.