*జగనన్న విద్యా దీవెన పడక ముందే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డిగ్రీ విద్యార్థుల నుండి అక్రమ ఫీజుల వసూళ్లను తిరిగి ఇస్తామన్న కళాశాల యాజమాన్యం*
రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్ (RPSF) ఆధ్వర్యంలో ఆదోని ఆర్ట్స్ కళాశాలలో నూతనంగా డిగ్రీ చేరిన విద్యార్థుల నుండి జగనన్న విద్యా దీవెన పడక ముందే విద్యార్థుల నుండి అక్రమంగా వేలల్లో ఫీజులు వసూలు చేసిన కళాశాల యాజమాన్యం తిరిగి విద్యార్థులకు కట్టిన ఫీజులను ఇవ్వాలని ఆదోని ఆర్ట్స్ కళాశాలలో ధర్నా నిర్వహించడం వలన విద్యార్ధులకు తిరిగి ఫీజులు ఇస్తామని కళాశాల యాజమాన్యం హామీ ఇచ్చారు.అలాగే రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్(RPSF) జిల్లా కార్యదర్శి బాలు మాట్లాడుతూ ఆదోని పట్టణంలోని జ్యోతిర్మయి,సాయి డిగ్రీ కళాశాలల్లో ధనార్జమే ద్యేయంగా నిబంధనలను భేఖాతారు చేస్తూ జగనన్న విద్యా దీవెన పడక ముందే విద్యార్థుల నుండి ఫీజులు వసూళ్లు చేయడం సరికాదన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జగనన్న విద్యా దీవెన మొత్తం విద్యార్థులకు వచ్చినప్పుడే ఫీజులు తీసుకోవాలని లేనియెడల రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వినోద్,హరికృష్ణ, విష్ణు,మహేష్,పవన్ విద్యార్థులు పాల్గొన్నారు.