in , ,

జగిత్యాల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు

జగిత్యాల జిల్లా పరిధిలో   22 (1) (a )నుండి (f ) మరియు 22 (2) (a) & ( b) &  సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్లి  సెక్షన్ 76  యాక్ట్ తేది సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు  ఆమలులో వుంటుందని  జిల్లా ఎస్పీ భాస్కర్  తెలిపారు. జిల్లా  పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని పేర్కొన్నారు. పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్  అధికారుల అనుమతి  తీసుకోవాలని సూచించారు. వివిధ కారణాలచే ర్యాలీలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు.

[zombify_post]

Written by Gopi

జగిత్యాల జిల్లాలో పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం

ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ