సంతబొమ్మాలి మండలం హనుమంతు నాయుడుపేట పంచాయతీ పరిధిలోని పోతునాయుడుపేటలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. పంట పొలానికి నీరు పెట్టేందుకు చెరువుకు వెళ్లిన మెత్తిన కామేష్ (66) తన కుమార్తె గిన్ని రాజేశ్వరి(46) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. నౌపాడ ఎస్ఐ కిషోర్ వర్మ ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు
[zombify_post]
 
					
 
			
			 
			
					
