in , , ,

చంద్రబాబు అరెస్టుకు నిరసన”

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ చేపట్టిన రిలే దీక్షలు గురువారం కొనసాగాయి. ఈ దీక్షలో నియో జకవర్గానికి చెందిన తెలుగు యువత రౌతు కామునాయుడు, వెన్నె సన్యాసినాయుడు, తాడ్డి సన్యాసినాయుడు, కెంగువ ధనుంజయ్‌ తదితరులు పాల్గొని, చంద్రబాబు అరె స్టును ఖండించారు. ఈ దీక్షలో గవిడి నాగరాజు, మహంతి అప్పలనాయుడు, మీసాల కాశీ, చల్లా శ్రీరామ్‌, మంత్రి రమణమూర్తి, పనస రవి, ఆరతి సాహు, కర్రోతు పైడిరా జు, జగదీష్‌, ముడిల రమణ, వెంపడాపు రమణమూర్తి, మన్నె ప్రకాశరాయుడు, నాగులపల్లి నారాయణరావు, దుర్గాసి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

గుర్ల: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని టీడీపీ బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి వి.సన్యాసినాయుడు అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెట్టింగి గ్రామంలో గురువారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు

ఈ కార్యక్రమంలో నాగులపల్లి నారా యణరావు, అప్పలనాయుడు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్తాం

గజపతినగరం: వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై ఎటువంటి ఆధారాలు లేకుం డా అరెస్టు చేయడంపై క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చా ర్జి కేఏ నాయుడు అన్నారు. బాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గురువారం గజపతి నగరంలో బీసీ సంక్షేమ సంఘ నాయకులతో రిలే దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి అబంటి టీడీపీ ఎమ్మెల్యేలపై కవ్వింపు చర్యలు చేపట్ట డం శోచనీయం అన్నారు. గజపతినగరం, దత్తిరాజేరు, గంట్యాడ మండలాల టీడీపీ అధ్యక్షులు ఎ.లక్ష్మునాయుడు, పెద్దింటి మోహన్‌, కొండపల్లి భాస్కరనాయుడు, రాష్ట్ర నాయకులు పీవీవీ గోపాలరాజు, బొండపల్లి మాజీ జడ్పీటీసీ బి.బాలాజీ, సీహెచ్‌సీ మాజీ చైర్మన్‌ మిత్తిరెడ్డి వెంకటరమణ, ప్రదీప్‌కుమార్‌, దాకి నారాయణప్పలనాయుడు పాల్గొన్నారు.

టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఆధ్వ ర్యంలో ఏడొంపుల గెడ్డలో పార్టీ నాయకులు జలదీక్ష చేపట్టారు. పార్టీ నాయకులు చప్పా చంద్ర, లెంక చిన్నంనాయు డు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఎస్టీ, ఎస్టీ సామాజిక వర్గాలతో దీక్షలో కోళ్ల

శృంగవరపుకోట: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎస్‌.కోటలో గురువారం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గంతో కలిసి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోళ్ల లలిత కుమారి రిలే దీక్ష చేపట్టారు. రాష్ట్ర ఎస్టీసెల్‌ ఉపాధ్యక్షురాలు, వేపాడ మాజీ ఎంపీపీ దాసరి లక్ష్మి, నియోజకవర్గ ఐటీడీపీ కార్యదర్శి అనకాపల్లి చెల్లయ్య, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గల ప్రతినిధులు సవరాల తాతారావు, గొర్లె కన్నతల్లి, తుమ్మి రామ తులసి, తెరపల్లి సూరిబాబు, సబ్బవరపు మరిడయ్య, దేబారికి అప్పారావు, వన్న శివరామకృష్ణ, కాకి దేముడమ్మ, కొడుపూరి అప్పలకొండ తదితరులు 500 మంది దీక్షలో కూర్చున్నారు. టీడీపీ ఎన్‌ఆర్‌ఐయూఏఈ విభాగం ప్రధాన కార్యదర్శి వాసు రెడ్డి సంఘీభావం తెలిపారు.

ఎస్‌.కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి చేపట్టిన రిలే దీక్షకు డప్పు కళాకారులు, చర్మకళాకారులు సంఘీభావం తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ, అప్పల రామప్రసాద్‌, నాయకు లు జీఎస్‌నాయుడు, కరెండ్ల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు తిరగబడుతున్నారు

శృంగవరపుకోట: చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ అన్నారు. శృంగవరపుకోట ఆకుల డిపో వద్ద గురువారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి రిలే దీక్ష చేశారు. నియోజకవర్గ మహిళాఅధ్యక్షురాలు గుమ్మడి భారతి, నాయకులు లగుడు రవికుమార్‌, బండారు పెదబాబు, రాయవరపు చంద్రశేఖర్‌, రెడ్డి పైడిబాబు, జుత్తాడ రామసత్యం, ఇప్పాక త్రివేణి, ముక్కారామకృష్ణ, ఎం.మంగరాజు, చప్పదేముడు, కర్రి కృష్ణ, కిల్లి దేవి తదితరులు రిలే దీక్షలో కూర్చొన్నారు.

బొబ్బిలి: చంద్రబాబుకు మద్దతుగా బొబ్బిలి పట్టణంలో రిలేదీక్షా శిబిరంలో మెట్టవలస గ్రామానికి చెందిన సుమారు వందమంది మహిళలు గురువారం పాల్గొన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీనాయన ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం చంద్రబాబుకు మద్దతుగా పార్టీ అభిమానులంతా కలిసి వందలాది పోస్టుకార్డులు రాసి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పంపించారు. బొబ్బిలి పట్టణ, మండల పార్టీ అధ్యక్షుడు రాంబార్కి శరత్‌బాబు, వాసిరెడ్డి సత్యనారాయణ, సీనియర్‌ నేతలు అల్లాడ భాస్కరరావు, నాగిరెడ్డి రామారావు, కాకల వెంకటరావు, కంచి వెంకటరావు, బీసపు చిన్నారావు, బీసీ సాధికారత రాష్ట్ర యాత విభాగ సమితి ప్రతినిధి యడ్ల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం రూరల్‌: విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో గురువారం పోస్టుకార్డు ఉద్యమంలో భాగంగా టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు పార్టీ కార్యాలయంలో పోస్టుకార్డుపై తమ అభిప్రాయాన్ని రాసి, సంతకం పెట్టారు. అనంతరం పార్టీ శ్రేణులకి పోస్టుకార్డులు అందజేశారు. ప్రజల్లోకి వెళ్లి, వారి, వారి అభిప్రాయాలతో పోస్టుకార్డులను రాయించి, చంద్రబా బు ఉన్న రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు చిరునామాకు పోస్టుకార్డులు పంపించనున్నారు.

వినాయకునికి పూజలు

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ, తక్షణమే ఆయనను విడుదల చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పూజలు చేశారు. నగరంలోని నెయ్యలవీధిలో ఉన్న వినాయక విగ్రహం వద్ద గురువారం ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Prasad

ఓటుతో బుద్ధి చెబుతారు”

ఖండ్యాం రోడ్డు పరిశీలన”