రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు
నెల్లిమర్ల: రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నెల్లిమర్ల లో కొనసాగుతున్న రిలే దీక్షలో ఆయన గురువారం పాల్గొని, మాట్లాడారు. ఈ శిబిరంలో పార్టీ నాయకులతో పాటు భోగాపురం మండలానికి చెందిన మత్స్యకారులు పాల్గొన్నారు. టీడీపీ నాయకుడు సువ్వాడ రవిశేఖర్, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, నెల్లిమర్ల, భోగాపురం, పూసపాటిరేగ మండల కమిటీల అధ్యక్షులు కడగల ఆనంద్‌కుమార్, కర్రోతు సత్యనారాయణ, మహంతి శంకరరావు, పార్టీ నాయకులు పతివాడ తమ్మినాయుడు, అప్పలనాయుడు, గేదెల రాజారావు, లెంక అప్పలనాయుడు మైలపల్లి సింహాచలం, దంగా భూలోక, మైలపల్లి తాత, మైలపల్లి బాబాజీ, బర్రి నూకరాజు, అరజాల్ల నరేష్, పసుపులేటి గోపి, కర్రోతు రాజు, మైలపల్లి ఎల్లాజీ, ఆకిరి ప్రసాద్, పిన్నింటి సన్యాసినాయుడు పాల్గొన్నారు.