గురు న్యూస్ విశాఖపట్నం :న్యూఢిల్లీ లోని నిర్మాణ్ భవన్ లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ గారితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి విడదల రజిని గారు భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో నిర్మాణం జరుగుతున్న నూతన వైద్య కళాశాల అనుమతుల విషయం పై కేంద్ర మంత్రి గారితో చర్చించారు.NMC కొత్త మార్గదర్శకాల వల్ల రాష్ట్రం లో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న వైద్య కళాశాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలి అనికోరారు.ఈ విషయమై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి,తగిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారని విడదల రజిని అన్నారు.