డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో 37.7 లక్షల రూపాయలతో నిర్మించనున్న తాగునీటి వాటర్ ట్యాంక్ మరియు 300 కుటుంబాలకు ఇంటింటికీ కుళాయి అందించే పనులకు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గ వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, చెముడులంక గ్రామంలో ఎంతో కాలంగా ఉన్న ప్రధాన డ్రైన్ నిర్మించుకోవడం జరిగింది అని, వివిధ సీసీ రోడ్లు, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం తదితర భవనాలు నిర్మిస్తున్నామని అన్నారు.
అలాగే గ్రామంలో మిగిలిన గృహాలకు కూడా తాగునీరు అందించేందుకు 54 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని, టెండర్లు పిలవడం జరిగింది అని త్వరలోనే ఆపనులు కూడా ప్రారంభించి పూర్తి చేయడం జరుగుతుంది అని తెలియచేశారు.