in ,

అంగన్వాడి మహిళల మహా ధర్నాపై ప్రభుత్వం పోలీసుల ద్వారా అణిచివేత

ప్రభుత్వం  IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం !

 గుంతకల్ పట్టణంలో 25 /9/2023 తేదీన రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు )ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు సర్కిల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది. రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్షా పదివేల మంది ఉన్న అంగనవాడి వర్కర్లు హెల్పర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటిని  ఇవ్వాలి  , పిఎఫ్ ,  ఈఎస్ఐ లను అమలు పరచాలి , మరియు వివిధ రకాల యాప్ ల పేరుతో పెంచిన పని భారాన్ని తగ్గించాలని, మినీ అంగన్వాడి వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని, నాణ్యమైన, సరైన కొలతలతో కూడిన సరుకులు సరఫరా చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారానికై సోమవారం విజయవాడలో మహాధర్మాకు ఐ.ఎఫ్.టి.యు. అనుబంధ ఏపీ ప్రగతిశీల అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏఐటియుసి అనుబంధ ఏపీ అంగన్వాడి వర్కర్స్& హెల్పర్స్  అసోసియేషన్ , సిఐటియు అనుబంధం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ లు పిలుపునివ్వడం జరిగినది.

  ప్రభుత్వం మహాధర్నాన్ని విచ్ఛిన్నం చేయడానికి పోలీసుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్  నాయకురాలకు , నోటీసులు ఇవ్వడం,  హౌస్ అరెస్టులు  చేయడం , అక్రమ కేసులను  బనాయిస్తామని బెదిరించడం , తీవ్ర అణిచివేత చర్యలకు పాల్పడడాన్ని వ్యతిరేకిస్తున్నాము మరియు అనేకమంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు విజయవాడ మహాధర్నకు వెళ్తుంటే బస్సు స్టేషన్లు ,  రైల్వే స్టేషన్లలో వందలాది మందిని అదుపులోకి తీసుకోవడం జరిగినది . ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలారిని , ఇంకా ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులను  , వివిధ కార్మిక సంఘాల నాయకులను కూడా పోలీసులు అక్రమ నిర్బంధంలో తీసుకోవడం జరిగినది . శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి కార్మిక సంఘాల నాయకులను అంగన్వాడి వర్కర్లను చట్టవిరుద్ధంగా అరెస్టులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ఫాసిస్ట్ నియంతృత్వ చర్యలను  ఐఎఫ్టియు యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నది .

    ప్రభుత్వం అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి , పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన ఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శి పోలారిని మరియు ఇతర కార్మిక సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలి  , భవిష్యత్తులో అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ చేయబోవు ఆందోళన కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలుపుతున్నాము .

ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU ) జిల్లా ప్రధాన కార్యదర్శి బి సురేష్ ,  డివిజన కార్యదర్శి చిన్నా ,  పట్టణ అధ్యక్షులు రామాంజనేయులు , పిఓడబ్ల్యు నియోజకవర్గ కార్యదర్శి ఆశాబి ,  ఐ ఎఫ్ టి యు జిల్లా కమిటీ సభ్యులు సత్తార్ , కమిటీ సభ్యులు జిలాన్  , కృష్ణ  , భాష  , నారాయణ  , గోపి  , రాందాస్ , జానయ్య తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

ఉరితాడుతో టీడీపీ నాయ‌కులు వినూత్న నిర‌స‌న‌

విద్యార్థుల నుంచి అక్రమంగావసూలు చేసిన కోర్సుఫీజులనుతిరిగి ఇవ్వాల